కావలసిన పదార్థాలు
సజ్జపిండి - కిలో, సోంపు - 25 గ్రా
నువ్వులు - 25 గ్రా, గసాలు - 25 గ్రా
యాలకులు - 4, బెల్లం - అరకిలోమంచి నూనె - వేయించడానికి సరిపడినంత
తయారు చేసే విధానం
బెల్లాన్ని మెత్తగా కొట్టి సరిపడినన్ని నీళ్లతో ముదురుపాకం పట్టాలి. అందులో సజ్జపిండి ఉండలు కట్టకుండా నెమ్మదిగా కలపాలి. అందులోనే గసాలు, సోంపు, నువ్వులు వేసి కలపాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీల్లా వత్తాలి. వీటిని నూనెలో దోరగా వేయించాలి.
No comments:
Post a Comment