"వరుడు" త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. "బన్నీ" హీరో, మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ వివాహం వచ్చే మార్చి ఆరో తేదీన జరుగనుంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా జరిగే ఈ వివాహ మహోత్సవానికి ముహూర్తం రాత్రి 10.33 నిమిషాలకు నిర్ణయించారు. హైదరాబాద్‌కు చెందిన శ్వేతారెడ్డితో అల్లు అర్జున్ వివాహం జరుగనుంది. అల్లుఅర్జున్-శ్వేతారెడ్డిల పెళ్లి పత్రికలను ఇప్పటికే సన్నిహితులు, బంధువులకు అందజేశారు. మార్చిన ఆరున వివాహం, పాలకొల్లులో రిసెప్షన్ వేడుకలు జరగుతాయని తెలిసింది. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డితో ఇటీవల అల్లుఅర్జున్ నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment