మటన్ చాప్స్ - 6
నెయ్యి - 4 స్పూన్లు
అల్లం వెల్లుల్లి - 2 స్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్ - 2 స్పూన్లు
నిమ్మరసం - 3 స్పూన్లు
గరం మసాలా - 1 స్పూన్
వేయించిన జీలకర్ర పొడి - 1 స్పూన్
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
తయారు చేసే పద్ధతి
మటన్ చాప్స్‌కి అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, పెరుగు, ఉప్పు పట్టించి పావుగంట నానబెట్టాలి. తర్వాత కుక్కర్‌లో పెట్టి పది నిమిషాలు ఉడకబెట్టాలి. వీటిని తీసి చల్లారనివ్వాలి. పెనంమీద నెయ్యి రాసి సన్నని సెగమీద బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడిగా తింటే చాలా రుచిగా వుంటాయి.
No comments:
Post a Comment