Monday, January 11, 2016

ప్రెగ్నెంట్ ఉమెన్ అలర్ట్ గా ఉండాల్సిన సమయాలు

గర్భం దాల్చడం అనేది చాలా అద్భుతమైన అనుభూతి. అలాగే.. చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయం కూడా.
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందంటే.. ఏ తల్లికైనా ఆనందమే. కానీ.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా. కాబట్టి ఏ చిన్న కదలికలు, లక్షణాలు మీలో కనిపించినా.. వెంటనే అలర్ట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయిన మొదటి రోజుల నుంచి తొమ్మిదో నెల వరకు ప్రతి విషయంలోనూ.. ప్రతి లక్షణంలోనూ జాగ్రత్త వహించాలి. పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే...? మీ గర్భం దాల్చిన తర్వాత ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఏ మాత్రం అనుమానం కలిగినా.. ఆలస్యం, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అలా కాకుండా మీకు తోచిన మెడిసిన్స్ ఉపయోగిస్తే మాత్రం రిస్క్ పడతారు. సో బీ అలర్ట్ అని సూచించే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం.. పొట్ట పైభాగం లేదా కింది భాగంలో నొప్పి: ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట భాగంలో కొంచెం నొప్పిగా ఉన్నా.. ఎక్కువ నొప్పిగా ఉన్నా అలర్ట్ అవ్వాల్సిన సమయం. దీనికి అనేక కారణాలుంటాయి. జీర్ణం సరిగా అవకపోవడం, ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ కారణమవవచ్చు. మీ సెకండ్ హాఫ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ నొప్పి కనిపించింది అంటే.. ప్రీ ఎక్లంప్సియా అంటారు. కాబట్టి అటెన్షన్ గా ఉండాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. గర్భిణీలకు మెంతులతో బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వాపు: ప్రెగ్నెన్సీ సమయంలో చేతులు, పాదం, ముఖం, కళ్లు వాపు సాధారణం. కానీ.. ఉన్నట్టుండి వాపు రావడం, తలనొప్పి, చూపు సమస్యలు వచ్చాయి అంటే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. బ్లీడింగ్ స్పాటింగ్ లేదా కొంచెం బ్లీడింగ్ గర్భం దాల్చిన మొదట్లో కామన్. కానీ.. ఇది సివియర్ బ్లీడింగ్ కి సంకేతం కావచ్చు. కాబట్టి ఏ మాత్రం బ్లీడింగ్ కనిపించినా.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ బ్లీడింగ్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఎలాంటి సమస్య కాకపోయినా.. కొందరికి ఇబ్బందులు తీసుకొస్తాయి. గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబు నివారించే మార్గాలు యూరిన్ పెయిన్: యూరిన్ పెయిన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంకేతం. యూరిన్ కి వెళ్లినప్పుడు నొప్పిగా ఉండటం, ఎరుపు రంగులో యూరిన్ రావడం, దుర్వాసన రావడం వంటివి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని సూచిస్తాయి. వీటిలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా.. డాక్టర్ ని సంప్రదించాలి.



No comments:

Post a Comment