Monday, November 23, 2015

ధనియాలలో దాగున్న అమోఘమైన హెల్త్ బెన్ఫిట్స్

మసాలా దినుసుల్లో కంపల్సరీ వాడే ధనియాలు ప్రతి ఇంట్లోనూ అవసరమే. చేదు, కారం, వగరు వంటి రుచుల సమ్మేళనమైన ధనియాలను సాంబారు, చారు, కూరల్లో వాడుతారు. ఏ వంటకానికైనా మంచి రుచితో పాటు,
ఘాటైన సువాసనను ఇస్తాయి ధనియాలు. ధనియాలు లేనిదే ఏ కూరలు వండరు. అలాంటి అమోఘమైన ధనియాలలో రుచే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ధనియాలలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె, C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన 30 శాతం విటమిన్ సి లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్ర్తీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
కొత్తిమీరలోని 11ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు గ్యాస్‌ నుంచి ఉపశమనం కలిగించడానికి, శరీరాన్నిచల్లబరచడానికి, లైంగిక శక్తి పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చిటికెలో చెక్ పెట్టే అద్భుతమైన గుణం కూడా ఈ ధనియాల్లో ఉంది.

No comments:

Post a Comment