Tuesday, September 29, 2015

ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ కి కారణమవుతున్న అంశాలేంటి ?

                         
యుక్తవయసు రాగానే.. ఉద్యోగం.. అది సంపాదించాక.. పెళ్లి.. పెళ్లి అవగానే పిల్లలు.. ఇది భారతీయులు పాటించే నియమం. కానీ.. మారుతున్న కల్చర్... పెరుగుతున్నఅభిరుచులు... భారతీయుల ఇష్టాలు.. నియమాలలో
మార్పులు తీసుకొస్తున్నాయి. సంప్రదాయాలను మార్చేస్తున్నాయి. అందుకే చాలామంది యువజంటలు.. పెళ్లి అయిన వెంటనే ఎందుకులే అని ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్నీని వాయిదా వేసుకోవడం ఈ రోజుల్లో చాలా సాధారమైందని చెప్పవచ్చు. పెళ్లి అయిన వెంటనే పిల్లలు ఎందుకని ఫీలయ్యేవాళ్లే ఎక్కువున్నారు. దానికి వ్యక్తిగత కారణాలు ఒకటైతే.. ఆర్థిక కారణాలు మరో రీజన్ గా చెప్పవచ్చు.

ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడానికి కారణాలేంటి ? 
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. యుక్తవయసులోనే బాగా కష్టపడి.. బాగా సంపాదించాలి అని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కార్పొరేట్ లైఫ్ కి అలవాటుపడిన వాళ్లంతా.. కెరీర్, గోల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. లగ్జరీగా బతకడం ఇప్పుడు ప్రపంచాన్నినడిపిస్తున్న ట్రెండ్. అందుకే అన్నీ సమకూరిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారు. ఇలా ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకోవడానికి సాధారణంగా కనిపిస్తున్న కారణాలేంటో చూద్దాం..

No comments:

Post a Comment