Saturday, August 22, 2015

గర్భస్త శిశువు మీద, తల్లి ఆరోగ్యం ఒత్తిడి యొక్క ప్రభావం

ప్రెగ్నెన్సీ సమయం చాలా సంతోషదాయకమైన సమయం.కానీ ఒక చిన్న ప్రాణిని ఈ ప్రపంచం లోకి తీసుకురావడమంటే అంత సులువు కాదు.ప్రెగ్నెన్సీ రక రకాలా భావాలని కలుగజేస్తుంది.వీటిలో ఒత్తిడి కూడా ఒకటి. ఒత్తిడి ని ఇంత అని అంచనా వెయ్యడం కష్టం.ఒకోసారి ఒత్తిడి సాధారణమే అయినా ఇది ప్రెగ్నెన్సీ లో ఎక్కువ అనిపించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయం లో మీ శరీరం లో వచ్చే మార్పులవల్ల ఒత్తిడి కి గురవ్వడం సహజం.కానీ ఈ
ఒత్తిడి కనుక ఎక్కువయితే అది మీ బిడ్డ మీద శాశ్వత ప్రభావాన్ని చూపించవచ్చు.మీకు కనుక నిరంతర ఒత్తిడి ఉంటే ఆ ప్రభావం తప్పకుండా మీ బిడ్డ మీద ఉంటుంది.చాలా మంది తల్లులు ప్రెగ్నెన్సీ సమయం లో స్ట్రెస్స్ ని, క్లినికల్ డిప్రెషన్ ని అనుభవిస్తూ ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రెగ్నెన్సీ సమయం లో ఒత్తిడి తల్లీ బిడ్డల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని కలగచేస్తుంది.గర్భస్త మహిళ ఉద్యొగం కనుక గంటల తరబడి విరామం లేకుండా పని చేసేదయితే ఆమెకి ముందస్తు ప్రసూతి నెప్పులువచ్చే అవకాశం ఎక్కువ.తల్లి పడే ఒత్తిడి పిండాని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయం లో ఒత్తిడి ప్రభావాన్ని కింద ఇచ్చాము. చూడండి 1)మెదడు మీద దుష్ప్రభావం: ప్రెగ్నెన్సీ సమయం లో మీకు బిడ్డ ఆరోగ్యం కోసం ఏమి తినాలి, త్రాగాలి అని ఆందోళన ఉండటం సహజం.మీరు కనుక వారానికి 32 గంటలకు మించి ఒత్తిడితో పనిచేస్తున్నట్లయితే తప్పకుండా అది మీ గర్భం లోని బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్లే మీరు తల్లి కావటానికి సిద్ధం గా ఉన్నారా అని ముందరే నిర్ణయించుకోవాలి.గర్భస్త తల్లుల ఒత్తిడి గర్భం ధరించిన తరువాత 17 వారాల వరకూ ఉంటుంది.అంటే మీ బిడ్డ ఎదిగే క్రమ లో ఉండే ఈ ఒత్తిడి వల్ల పిండం మెదడుకి, ఎదుగుదల కీ హాని కలిగించవచ్చు. 2)తక్కువ బరువుతో పుట్టడం: ప్రెగ్నెన్సీ సమయం లో మీ శరీరం అనేక మార్పులకి గురవుతుంది.మీ శరీరం లో జరిగే హార్మోనుల మార్పులు మీ మూడ్ ని కూడా ప్రభావితం చేస్తాయి.మీకు కనుక ఒత్తిడి ఎక్కువ గా ఉంటే నిద్ర లేమి, ఆకలై లేకపోవడం లాంటి లక్షణాలు కలిగి ఎదిగే పీ బిడ్డ ని ప్రభావితం చేస్తాయి ఒత్తిడి ఎక్కువయితే బీపీ పెరిగి ముందస్తు ప్రసవం జరిగే అవకాశాలెక్కువ.అధ్యయనాల ప్రకారం తల్లుల మీద ఒత్తిడి పెరిగితే అది బిడ్డ మీద ఆ ప్రభావం హానికారకం గా ఉండి తక్కువ బరువుతో పుట్టే అవకాశాలున్నాయి. 3)ప్రీ ఎక్లాంప్ షియా:ఒత్తిడితో ఎక్కువ గంటలు పని చేసే తల్లు దీనికి గురయ్యే అవకాశం ఎక్కువ. ఈ ప్రీ ఎక్లాంప్ షియా ని ఇంతకుముందు టాక్సేమియా అని వ్యవహరించేవారు.ఇది గర్భవతుల్లకి ఒత్తిడి మూలం గా కలిగే సమస్య.రెండు లేదా మూడో త్రైమాసికం లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.ఒకోసారి ఇది ముందస్తుగా కూడా కనిపించవచ్చు. 4)గర్భస్రావం: ఒత్తిడీ వల్ల మెదదు "కోర్టికోట్రోఫిన్" అనే హార్మోను ని స్రవిస్తుంది.శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం గర్భస్త మహిళలు ఒత్తిడీకి గురయితే వారిలో "కోర్టిసోల్" అనే హార్మోను విడుదలవుతుంది.ఇది గర్భస్రావానికి కారకమవ్వచ్చు. ఇవీ గర్భస్త సమయం లో ఒత్తిడి వల్ల కలిగే ప్రభావాలు.

No comments:

Post a Comment