అవకాశం వస్తుంది. చిన్నారికి పిల్లో వాడడం మంచిదేనా? మొదటగా మీ చిన్నారి బోర్లా పడి నిద్రపోకుండా జాగ్రత్త పడండి. మీ చిన్నారి వెల్లకీలా పడుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. ఒక వేళ మీ చిన్నారికి పిల్లో కొనాలని మీరనుకుంటే వారికి 2 లేదా మూడేళ్ళు వచ్చేవరకు వేచి చూడండి. ఫ్లాట్ గా టైట్ గా నున్న పిల్లోనే ఎంచుకోవాలి. ఒకే పొజిషన్ లో మీ చిన్నారి ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటే మీరు కచ్చితంగా మీ చిన్నారి పొజిషన్ ను మార్చాలి. లేకపోతే ఒకే వైపు ఒత్తిడి ఎక్కువై నొప్పి కలుగుతుంది. మీ చిన్నారి నిద్రపోతున్నప్పుడు, తనకి ఊపిరి ఆడకుండా ఇబ్బంది కలిగించేలా బొమ్మలు అడ్డంగా ఉక్కిరిబిక్కిరి కలిగించే బొమ్మలు లేకుండా చూసుకోండి. చిన్నారికి నిద్రలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదురుకోవడం తెలియదు. మీరే గమనిస్తూ మీ చిన్నారి హాయిగా నిద్రపోయేలా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ చిన్నారికి పిల్లో వాడడం సురక్షితమేనా? కాదు.
ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్
ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ అనేది చిన్నారులకు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మీ చిన్నారి ఒకే పొజిషన్ లో మెత్తనైన దిండుపై ఎక్కువ సేపు నిద్రపోతే కొన్ని రకాల స్ట్రక్చరల్ డీఫార్మాలిటీస్ ఏర్పడతాయి. కాబట్టి, చిన్నారికి పిల్లోని వాడడం మంచిది కాదు.
ఉక్కిరిబిక్కిరి కావచ్చు
న్యూ బర్న్ బేబీకి పిల్లో అవసరమా? మనలో చాలా మంది పిల్లో ఉంటే హాయిగా నిద్రపోతారు. అయితే ఈ విషయం చిన్నారికి వర్తించదు. చిన్నారికి పిల్లో వాడితే వారు ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉండొచ్చు. మీ బేబీ సౌకర్యవంతంగా తన తలను అటూ ఇటూ తిప్పలేదు. ఫ్రీ మూవ్ మెంట్ ని పిల్లో అడ్డుకుంటుంది. పిల్లోలో వాడే పదార్థాలు చిన్నారి కంఫర్ట్ లెవల్స్ పై దుష్ప్రభావం చూపిస్తాయి.
బెణుకులు కలగవచ్చు
మీ చిన్నారి ఎక్కువ సేపు పిల్లోపై పడుకుని ఉంటే మెడ బెణికట్టే అవకాశాలు ఎక్కువ. సౌకర్యవంతంగా డిజైన్ చేసిన పిల్లో వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. దురదృష్టవశాత్తు, బేబీ పిల్లోస్ చాలా మటుకు సరిగ్గా డిజైన్ చేసినవి కావు. వీటిని దృష్టిలో పెట్టుకుని చిన్నారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.
టెంపరేచర్ సమస్యలు
చిన్నారికి పిల్లో అవసరమా? పాలిస్టర్ వంటి పదార్థాలతో పిల్లోని తయారు చేసినట్లయితే అటువంటి పిల్లోలను వాడడం మంచిది కాదు. అవి చిన్నారి తలలోని ఉష్ణోగ్రతలు పెంచుతాయి. కొన్ని పదార్థాలు విపరీతమైన చెమటను కలిగిస్తాయి. కాబట్టి, చిన్నారి నిద్రపోయినప్పుడు తనకి శ్వాస ఇబ్బంది కలగకుండా ఆడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. పిల్లో వల్ల చిన్నారి ఇబ్బందులకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లో వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా కాటన్ పిల్లోకే ప్రెఫరెన్స్ ఇవ్వండి.
No comments:
Post a Comment