అమ్మాయి నెల తప్పిందనగానే మొదలవుతుంది.. సంబరం! ఇక వేవిళ్లు, మొక్కులు, సూడిదలు, సీమంతాల నుంచి.. నట్టింట పసిబిడ్డ కేరింతలు కొట్టే వరకూ ప్రతిదీ పండగే!
ఇల్లంతా ఒకటే కోలాహలం. ఇదో ప్రకృతి పండుగ. పునరుత్పత్తికి మూలమైన గర్భధారణ, ప్రసవాలు ప్రకృతి సహజమైన శారీరక ప్రక్రియలు. వీటి విషయంలో తరతరాలుగా, సంప్రదాయంగా వస్తున్న విజ్ఞానం అనంతరం. అయితే ఇప్పుడీ తరతరాల తీగలు తెగిపోతున్నాయి. కుటుంబాలు చిన్నవైపోతూ... అమ్మలు, బామ్మలు దగ్గరుండే పరిస్థితి లేదు. వెన్నుదన్నుగా ఉండేవారు కరవౌతున్నారు. దీంతో గర్భధారణ అనగానే గుండె నిండా సంబరంతో పాటే... నేటితరం తల్లులకు మనసులో ఏదో మూల చిన్నచిన్న సంకోచాలూ పీడించటం ఎక్కువవుతోంది. మరోవైపు సంప్రదాయ విజ్ఞానంతో పాటే బోలెడు అశాస్త్రీయమైన నమ్మకాలూ జనం నోళ్లలో నలుగుతున్నాయి.
ఆహారం చాలామంది గర్భిణులు 'ఇద్దరి కోసం తినాలని' నమ్ముతూ దీన్నే ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవానికి అతిగా తినటం వల్లే సమస్యలు తలెత్తుతాయి. ఇష్టంగా తినటం, బిడ్డకు కావాల్సినంత పోషకాలను అందించేలా తినటం ముఖ్యం. గర్భిణి తీసుకునే ఆహారం వారికి పుట్టే పిల్లలనూ ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. గర్భిణులు కొవ్వు పదార్ధాలు, స్వీట్ల వంటివి ఎక్కువగా తినటం వల్ల వారికి పుట్టే పిల్లలు కూడా వాటి పట్ల ఇష్టాన్ని పెంచుకుంటారు. ఇది మంచిది కాదు. కాబట్టి గర్భిణి ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవటం తనకే కాదు, పుట్టే పిల్లలకూ మంచిది. దీర్ఘకాలంలో ప్రభావం చూపే అంశం ఇది. గర్భిణులు మాంసకృత్తులు దండిగా తీసుకోవాలి. అవసరమైతే ప్రోటీన్ సప్లిమెంట్ అయినా తీసుకోవాలి. గర్భిణులు ఉప్పు తగ్గించాల్సిన అవసరమూ లేదు.

No comments:
Post a Comment