Thursday, July 3, 2014

గర్భిణీలకు గుడ్డు అసురక్షితంగా భావిస్తారు?


సహజంగా మహిళలు గర్భం పొందిన వెంటనే వారిలో మెదిలే మొదటి ప్రశ్న ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు?పొట్టలో పెరిగే శిశువుకు హాని కలగకుండా ఇది తినవచ్చా లేదా అది తినవచ్చా అని అనేక ప్రశ్నలను అడుగుతుంటారు. కొన్ని ప్రత్యేక ఆహారాలు బొప్పాయి, పైనాపిల్ మరియు చైనీస్ గ్రాస్ వంటివి గర్భిణీలకు ఖచ్చితంగా తినకూడని ఆహారాల లిస్ట్ లో నిషేదింపబడినవి. కానీ భారతదేశంలో, గుడ్డు తినడం వల్ల కూడా చాలా వివాదాలకు కారణమవుతుందని నమ్ముతారు. అనేక సాంప్రదాయ విశ్వాసం ప్రకారం గర్భిణీలు గుడ్డు తినడం సురక్షితం కాదని విశ్వసిస్తారు.

ఈ విషయాన్ని డాక్టర్లు కొట్టి పారేసినా, మన అమ్మలు, అమ్మమ్మలు మాత్రం గర్భీణీలు గుడ్డు తినకూడదని, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో(మొదటి మూడునెలల్లో)గుడ్డు తినకూడదని నిక్కచ్ఛింగా చెప్పడమే కాదు,ఆంక్షలు విధిస్తారు. గర్భిణీలకు గుడ్డు అసురక్షితంగా భావిస్తారు?
 గుడ్డు బాడీ హీట్ ను కలిగిస్తుంది. ఏవిధంగా బాడీ హీట్ పెరిగినా అది బేబికి సురక్షితం కాదు. శరీరం వేడి చేస్తే అబార్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత మోడ్రన్ సైన్స్ లో ప్రకారం ఈ విషయాన్ని చాలా మంది ఎక్కువగా నమ్ముతున్నారు. ఇన్ ఫెర్టిలిటితో బాధపడే వారు, నమ్మాల్సి వస్తోంది. గుడ్డు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. గుడ్డు అంత తేలికగా మరియు త్వరగా జీర్ణం అవ్వదు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో హార్మోనులు చాలా క్రేజీగా ఉంటూ హెచ్చుతగ్గులుంటాయి. ఇంకా గుడ్డు గాఢ వాసన కలిగి ఉంటుంది. చాలా మంది గర్భిణీలకు ఈ వాసన అంటే పడకపోవచ్చు. వారికి వాంతులకు గురిచేస్తుంది. మొదటి త్రైమాసికంలో గుడ్డును నిషేధించడానికి ఇది ఒక కారణం కావచ్చు. గర్భిణీ స్త్రీలకు గుడ్డు సురక్షితమేనా? 
మీరు మెడికల్ ఆప్షన్ తో పోతున్నట్లైతే , గర్భిణీలకు ఖచ్చితంగా సురక్షితం. నిజానికి గర్భధారణ సమయంల గుడ్డు తినడం వల్ల ఇందులో అనేక ప్రోటీనులుండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టలో పెరిగే శిశువుకు పెరుగుదలకు మరియు గర్భిణీలకు అత్యవసరం అయ్యే ప్రోటీనులు, క్యాల్షియం, విటమిన్ డి, ఐరన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుడ్డులో పుష్కలంగా వల్ల గర్భిణీ స్త్రీలు రోజుకు 2 గుడ్లు తినడం చాలా అవసరం. కాబట్టిపూర్తి పోషకాలున్న పౌష్టికాహారం గుడ్డు. గర్భాధారణ సమయంలో మీరు ఎన్ని గుడ్లు తినవచ్చు అనివచ్చు అని తెలుసుకోవాలంటే, మీ డాక్టర్ ను సంప్రదించాలి. గర్భిణీలు వారి చివరి త్రైమాసికంలో ఎక్కువ ప్రోటీనులు అత్యవసరం అవుతాయి. కాబట్టి, కొంత మంది గర్భిణీలను ఎక్కువగా తీసుకోమని కూడా సలహాలిస్తుంటారు. 
అన్నిరకాలుగా గుడ్డు తినడం సురక్షితమేనా? 
పచ్చిగుడ్డు లేదా సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ వంటివి గర్భధారణలో సమయంలో నివారించడం మంచిది. గర్భిణీలో సాల్మనెల్లా బ్యాక్టీరియంను ఏర్పరుస్తుంది . పగలని గుడ్డులో బ్యాక్టీరియా పెరగి ఉంటుంది. కాబట్టి, ఉడికించే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత తీసుకోవాలి. గుడ్డును బాగా ఉడికించి తీసుకోవడం గర్భిణీ స్త్రీలు తినడం మంచిది . మరియు ఉడికించిన గుడ్డును ఎక్కువ సమయం నిల్వ చేసి తినడం కూడా మంచిది కాదు. ఉడికించిన వెంటనే గుడ్డును తినడం మంచిది . అలాగే మెయోనైజ్ మరియు పుడ్డింగ్ వంటివి తినకుండా నివారించాలి.
 


No comments:

Post a Comment