గర్భధారణ అనేది ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడటానికి పునాది వంటిండి.
ఒక ప్రాణంను కొత్తగా భూప్రపంచంలోనికి తీసుకురావడంలో తల్లి ఎంతో ఆత్రుతగా
ఎదురుచూస్తుంటుంది. తల్లికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, ఆనందం, అనేక ఇతర
పాత్రల గురించి తల్లిలో ఆందోళన ఎన్నో మనస్సులో మెదులుతుంటాయి.
గర్భధారణ ప్రారంభమైన తర్వాత, మహిళ శరీరంలో అనేక మార్పులు, హార్మోనుల
అసమతుల్యత వల్ల వేవిళ్ళు, వెన్ను నొప్పి, మూత్రం ఆపుకోలేని మరియు అసౌకర్యం
ఇలా అన్ని రకాలుగా మహిళ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అలాగే గర్భంతో ఉన్న
మహిళ ఏమీ తినడానికి వీలుకాకపోవడం వల్ల మీరు ఏమి తినవచ్చు మరియు ఏమితినకూడదు
అని అనేక సలహాలు, వ్యాయామా చిట్కాలు అనేకం మీకు అంధిస్తుంటారు. వీటిలో ఏమి
విన్నా, వినకపోయినా ముఖ్యంగా ఏమి తినవచ్చు, తినకూడదనే విషయం మీద ఎక్కువ
ఏకాగ్రతతో వింటారు.
ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో చాలా సాధారణమైన సందోహం, ఆరోగ్యకరమైన బిడ్డ
పుట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?గర్భిణీ స్త్రీలు వారి రెగ్యులర్
డైట్ లో కాలీఫ్లవర్ ను చేర్చుకోవడం చాలా ఒక ఉత్తమ పరిష్కారం. కాలీఫ్లవర్
వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని అనేక పరిశోధనలు
నిరూపించబడ్డాయి.
గర్భధారణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు గర్భిణీ స్త్రీకు
ఆరోగ్యకరమైనవే అనుకోండి, కానీ గర్భధారణ సమయంలో కాలీఫ్లవర్ ను ఎందుకు
విస్మరించకూడదని, తప్పకుండా తీసుకోవడానికి గల కారణాలేంటని ఈ క్రింది విధంగా
వివరించడం జరిగింది.

No comments:
Post a Comment