Thursday, January 16, 2014

గర్భిణీకి జలుబు చేస్తే : బెస్ట్ హోం రెమెడీస్

గర్భధారణ సమయంలో జలుబు తగ్గించడానికి నేచురల్ రెమెడీస్ గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీకి జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పు
డు అవి తప్పనిసరిగా గర్బిణీ స్త్రీ ఆరోగ్యం మీద ఆందోళన కలిగిస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు మందులు తీసుకొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి, సాధరణ జలుబు, ఇది సింపుల్ హెల్త్ కండీషన్ కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని చాలా సులభంగా నివారించవచ్చు. దగ్గు, జలుబు గర్భిణీ రెగ్యులర్ గా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే, తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ను కలవాలని సలహా. పరిక్ష చేసి, వైద్యుడు, అనేక మందులు మాత్రలు ప్రిస్ర్కిప్షన్ గా రాసి ఇస్తారు. మీరు చాలా ఎక్కువగా జలుబు మరియు దగ్గుతో బాధపడుతుంటే, కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా సురక్షితం. మెడికేషన్స్ తెలుసుకొనే ముందు, గర్భధారణ సమయంలో జలుబు చేసినప్పుడు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు తగ్గించుకోవడానికి గోరువెచ్చని మరియు హాట్ గా ఉండే ద్రవాలను త్రాగడం ఒక ఉత్తమ మార్గం. అంతే కాదు, జలుబుతో పాటు అనుసంధానంగా వచ్చే ఇతర జబ్బులు అంటే, తలనొప్పి, మరియు మెడనొప్పి కూడా తగ్గిస్తుంది. లక్షణాలు: జలుబు, ముక్కు మూసుకుపోవడం, డిస్చార్జ్, తుమ్ములు మరియు గొంతు నొప్పి, వంటి సమస్యలు సాధారణ జలుబుతో పాటు వస్తాయి. వీటిని నివారించడానికి నేచురల్ హోం రెమెడీస్ గర్భధారణ సమయంలో జలుబు దగ్గును నివారిస్తుంది.

No comments:

Post a Comment