Thursday, December 12, 2013

గర్భం పొందడానికి సురక్షితమైన వయస్సు

మహిళ జీవితంలో గర్భం పొందడం అనే ఒక గొప్ప అనుభం. ఒక ఆరోగ్యకరమైన గర్భం పొండానికి, ఒక ముఖ్యమైన ప్రణాళిక కలిగి ఉండటం చాలా అవసరం . మహిళ సురక్షితంగా మరియు సంతోషకరంగా గర్భం పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. గర్భం పొందడానికి ఒక సురక్షితమైన వయస్సు అత్యంత కీలకమై అంశాల్లో ఒకటి. శాంతియుతమైన మరియు హెల్తీ ప్రెగ్నెన్సీ పొందడానికి వయస్సు చాలా ముఖ్యం. గర్భం పొందడానికి మీరు కరెక్ట్ వయస్సు తెలుసుకోవడం వల్లమీ మానసిక మరియు శారీరక ప్రయోజనాలకు సహాయపడుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, పుట్టే బిడ్డ మానసికంగా మరియు శారీరకంగా పుట్టడానికి సహాయపడుతుంది. గర్భం పొందే వయస్సు ఒక్కో మహిళకు ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా 30 సంవత్సరాలలోపు గర్భం పొందడం అనేది గర్భధారణకు మంచి సమయంగా సూచిస్తారు. గర్భధారన 30 ఏళ్ళ తర్వాత కూడా జరగవచ్చు, కానీ , తల్లి మరియు బిడ్డలో నష్టాలు మరియు సమస్యలు అధికంగా ఉంటాయి. అంతేకాక, 30ఏళ్ళ తర్వాత గర్భం పొందే వారు ఎక్కువ స్టామినా మరియు దృఢత్వాన్ని కలిగి ఉండాలి. 35ఏళ్ళ తర్వాత గర్భధారణ తగ్గుముఖం ప్రారంభమౌతుంది. దాంత గర్భం పొందే అవకాశం తగ్గిపోతూ వస్తుంది.గర్భం ఏ వయస్సులోఐనా, కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటుంది. మీరు గర్భం పొందడానికి సురక్షితమైన వయస్సును తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉంటే ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు గుర్తుంచుకోవల్సినవి కొన్ని మీకోసం అంధిస్తున్నాం...

No comments:

Post a Comment