Wednesday, November 27, 2013

హెన్నా వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు

కురులు పట్టుకుచ్చులా మెరిసిపోయే సోయగమే వేరు. అలాంటి శిరోజాలు ఓ వరమని చెప్పుకోవచ్చు. ఎంత అందమైన కురులున్నా కూడా వాతావరణంలో మార్పుల వల్ల ప్రభావం వాటిపైపడుతుంది. జీవంకోల్పోయిన జుట్టుతోపాటు మరికొన్ని సమస్యలు వచ్చిపడతాయి. సమయానికి తగినట్లుగా సరైన జాగ్రత్తలు పాటిస్తూ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండేలా చూసుకోవడమే దానికి తగిన పరిష్కారం. జుట్టుకు సంబంధించిన ఏ సమస్యకైనా హెన్నా లేదా గోరింటాకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా హెయిర్‌ డైలు వాడే వారికి... పెర్మింగ్‌, స్ట్రెయిటనింగ్‌ చేయించుకున్నప్పుడు వాటిలోని రసాయనాల వల్ల జుట్టు, తల పొడిబారి, చుండ్రువచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్యలన్నింటికీ హెన్నా దివ్యౌషధంలా పనిచేస్తుంది. అయితే, సరైన రీతిలో వాడితేనే ప్రయోజనాలు పొందగలుగుతాం.ముఖ్యంగా పచ్చిగోరింటాకు ముద్ద కాకుండా పొడిని వాడాలి. అలాగే అన్నివయసులవారూ హెన్నాను ఒకేరకంగా పెట్టుకోకూడదు.

జుట్టుకు హెన్నా అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పొడి జుట్టు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టు పోగులు బలంగా మరియు మృదువుగా ఉండటానికి మరియు చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది. హెన్నాలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన మీ జుట్టుకు పోషణ మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అయితే హెన్న ఎలా అప్లై చేయాలని తెలుసుకోవడం ముఖ్యం. అనేక జుట్టు సమస్యలను నివారించే ఈ హెన్నా కలరింగ్ కోసం అయితే, కొంత హెన్నా పౌడర్ ను టీ లేదా కాఫీ డికాషన్ లో కలిపి పెట్టి, తలకు అప్లై చేసే ముందు పెరుగు మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. ఇది మీరు తీసుకొనే వస్తువుల మీదే మీ అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించగలుగుతాం. అదే మీకు చుండ్రు సమస్య ఉన్నప్పుడు, హెన్నా ప్యాక్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తర్వాత నూనె పెట్టుకొన్న తలకు ప్యాక్ లా వేసుకోవాలి . హెన్నా తడి ఆరిన తర్వాత చిక్కుబడకుండా ఉంటుంది . హెన్నా ప్యాక్ పెట్టుకొన్న తర్వాత 30-45నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి. కేశాలకు నేచురల్ హెయిర్ కండీషనర్ కావాలంటే హెన్నా ప్యాక్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు.
1. హెయిర్ కలర్:  హెన్నా వల్ల అత్యంత సాధారణ ప్రయోజనం, జుట్టు కలరింగ్ కోసం ఒక నేచురల్ డై గా ఉపయోగపడుతుంది. ఇది గ్రే హెయిర్ కు కలర్ అంధిస్తుంది. మరియు నేచురల్ హెయిర్ కలర్ ను అంధిస్తుంది.

No comments:

Post a Comment