బిడ్డల కోసం తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు. బిడ్డను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి నిచ్చెనలుగా మారతారు. బిడ్డకు ఆకలేసినపుడు తల్లి కంచంలో అన్నంలా మారిపోతే,
బిడ్డకు భయమేసినపుడు రక్షణ కవచంలా చుట్టుకుంటాయి తండ్రి చేతులు. ఇవన్నీ బిడ్డ ఈ లోకాన్ని చూసిన తరువాత జరిగే పనులు. నిజానికి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే తల్లిదండ్రుల పేరెంటింగ్ ప్రారంభమైపోతుంది. కడుపులో ఉన్న బిడ్డతో అనుబంధం కోసం తల్లి తహతహలాడితే, ఆ తల్లికి, బిడ్డకి ‘నేనున్నాననే' భరోసాని, ఆత్మీయ స్పర్శని అందిస్తారు తండ్రి. అలా తల్లిదండ్రుల పేరెంటింగ్ బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది. అలాంటిదే ‘జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ'. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే బిడ్డతో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోని థెరపీలు ఉపయోగపడతాయంటారు నిపుణులు. ఇంతకీ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే..! తొమ్మిది నెలలు, ఐదు థెరపీలు... క్లుప్తంగా చెప్పాలంటే ఇదే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మరి ఆ థెరపీలు అందుకు సంబంధించిన వివరాలేంటో మీరే చదవండి...
మ్యూజిక్ థెరపీ: జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ థెరపీలో భాగంగా అందించే థెరపీల్లో మ్యూజిక్ థెరపీ మొదటిది. గర్భస్థ శిశువులో ఐదోనెల నుండే వినికిడి శక్తి ప్రారంభమవుతుందని చెబుతారు వైద్యులు. ప్రహ్లాదుడు, అభిమన్యుడు వంటి వారు తల్లి గర్భం నుండే పురాణ గాథలను వినడం, పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసుకోవడాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. బయటి శబ్దాలను గర్భంలోని శిశువు వింటూ ఉంటాడు కాబట్టి తల్లి కూడా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. సంగీతం నుండి వచ్చే శబ్ద తరంగాలు మనిషి మెదడుపై ప్రభావం చూపుతాయి, అందులోనూ కడుపులో ఉన్న బిడ్డపై ఈ ప్రభావం మరింత ఎక్కువ. అందుకే గర్భిణులు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటూ ఉండాలి. ఈ సంగీతంలో కూడా ఉదయంవేళల్లో స్లో చాంటింగ్స్ (శ్లోకాలు, మంత్రాలు వంటివి), మధ్యాహ్న వేళల్లో మెలోడీ పాటలు, సాయంత్రం వేళ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ (వాయిద్య సంగీతం), రాత్రివేళ చాలా తక్కువ శబ్దంతో కూడిన వాద్య సంగీతాలను వినాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment