Wednesday, October 30, 2013

ఆయుర్వేదంతో బరువు తగ్గడం చాలా తేలిక

ఆయుర్వేద చికిత్స వల్ల శరీరంలోపల నిల్వవున్న టాక్సిన్స్ (మలినాలను ,విషాలను)తొలగించేందుకు సహాయపడుతుంది. ఆయుర్వేదంలో బరువు తగ్గించడం కోసం చేసే ఈ ప్రాథమిక అంశాన్ని ‘అమా' అంటారు. మన శరీరంలో ఏర్పడే టాక్సిన్స్ కు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, మరియు తీవ్రమైన ఒత్తిడి, హెక్టిక్ లైఫ్ స్టైల్. నీటిలో కరిగే టాక్సిన్స్ మూత్రం, మలం మరియు చెమట రూపంలో సులభంగా బయటకు నెట్టివేయబడుతాయి. కానీ నీటిలో కరిగేవికాకుండా, ఇతర టాక్సిన్స్ అలా నెట్టివేయక శరీరంలోనే నిల్వఉండి, ఉబకాయానికి దారితీస్తాయి. అయితే, అటువంటి టాక్సిన్స్ ను సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా సమర్థవంతంగా తొలగించుకోవచ్చు. అయితే, ఫ్యాట్ సోలబుల్ టాక్సిన్ ఉత్పత్తి అయితే మాత్రం అంత సులభంగా వీటిని తొలగించలేము. ఈ మాలిన్యాలు ప్రధానంగా కడుపు, హిప్ మరియు తొడ ప్రాంతంలో లక్ష్యంగా కొవ్వును ఏర్పరుస్తుంది. ఆయుర్వేద పద్దతులల్లో ‘అమా' శరీరం నుండి విషాలను బయటకు తీయడమే ప్రధాన లక్ష్యం. ఇది కొవ్వు కణాలను సమర్థవంతంగా కృంగిపోయే విధంగా చేస్తాయి. మీరు పాత పద్దతుల్లోకి మారితే కొవ్వును తొలగించడం మరింత ఎక్కువఅవుతుంది. ఈ పద్ధతిని రెగ్యులర్ చేయడం వల్ల శరీరం నుండి విషాన్ని మరియు మాలిన్యాలు తొలగించడం ఆదర్శవంతంగా నిర్విషీకరణ చేస్తుంది . ఇది భవిష్యత్తులో దీర్ఘకాలిక బరువు పెరుగే అవకాశాన్ని నిరోధిస్తుంది. ఇది ఒక సాధారణమైన స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవచ్చు , కానీ బరువు సమస్యలతో పోరాడటం కోసం ఆయుర్వేద పధ్ధతులు బాగా సహాయపడి ఆరోగ్యకరమైన జీవనశైలి మొదలుపెట్టువచ్చు. అంటే మీరు ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, మరియు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించాలి. ఎందుకంటే మన శరీరం కూడా ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ టైమ్ లో ఇదేచేయాలి, అని నిర్ధేశించుకుంటుంది. ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మీ ఆహారపు అలవాట్ల ద్వారా తెలుస్తుంది. ఆయుర్వేదంలో , కాలానుగుణ లభించే పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని ఊబకాయగ్రస్తులకు నిపుణులు సలహా ఇస్తుంటారు . అధిక ప్రోటీనులుండే నేచురల్ ఫుడ్స్ మరియు పండ్లు ద్వారా ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఆయుర్వేదంలో బరువు తగ్గించే పద్దతులను పాటిస్తున్నట్లైతే ప్రిజర్వేటివ్స్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు తప్పనిసరిగా నివారించాలి. అదనపు కొవ్వును త్వరగా మరియు ఎఫెక్టివ్ గా కరిగించుకోవడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద స్పూర్తితో ఇచ్చిన చిట్కాలు ఉన్నాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

Read more at: http://telugu.boldsky.com/health/wellness/2013/how-does-ayurveda-help-weight-loss-006755.html

No comments:

Post a Comment