Monday, September 16, 2013

ఆటల్లో సడలుతున్నఆంక్షల పట్టు

ఛాందసవాద భావాలకు పేరుపడ్డ సౌదీ అరేబియా మహమ్మదీయ మహిళలపై ఆంక్షల పట్టు సడలించింది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే ఆడపిల్లలు ఆటలలో
పాల్గొన వచ్చంటూ ఈ మధ్యే కొత్త ఆదేశాలు జారీ చేసింది. స్త్రీ పురుష సమానత్వం అన్న మాట ఇంకా అందనంత దూరంలో ఉన్నప్పటికీ ఈ చర్యతో ఓ శుభారంభమైతే జరిగింది.


లింపిక్స్‌ నిబంధనల ప్రకారమైతే జాతి, మతం, రాజకీయాలు, స్త్రీ పురుషులకు అతీతంగా అందరూ ఆటలో పాల్గొనడానికి అర్హులే. అంతేకాక ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆటగాళ్ళలో మహిళలు తప్పనిసరిగా ఉండాలని ఆంక్షలు పెట్టింది. అందుకే సౌదీ అరేబియాతో పాటు బ్రూనై కూడా ఇద్దరు మహిళా అథ్లెట్‌లను మొదటిసారిగా క్రిితం సంవత్సరం లండన్‌ పంపింది. ఆటలలో పాల్గొన్న ఇద్దరు టీనేజ్‌ బాలికలు - ట్రాక్‌ అథ్లెట్‌ సారా అత్తర్‌ (19),జూడో ప్లేయర్‌ వోజ్‌దామ్‌ అలీ షాహెర్‌ ఖాన్‌ (16)లలో ఒక్కరు కూడా పతకాలు గెలవలేదు గానీ, ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా నిలిచారు. ట్రాక్‌లో సారా అత్తర్‌ అందరి కన్నా వెనకబడినప్పటికీ, ప్రేక్షకుల నుండి ఆమెకు ప్రోత్సాహకరంగా చప్పట్లు మోగు తూనే ఉన్నాయి. వోజ్‌దామ్‌ జూడోలో ఓడిపోయినప్పటికీ, సౌదీ మహిళల విభా గానికి ఒక పాయింట్‌ సాధించి పెట్టింది.
అయితే, ముస్లిమ్‌ ఆడపిల్లలు ఒలిం పిక్స్‌లో ఎలాంటి ముసుగూ లేకుండానే ఆడడం, బంగారు పతకాలు గెలవడం దశాబ్దం కిందటే మొదలైంది. 1984లో లాస్‌ ఏంజల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మొదటిసారిగా ప్రవేశ పెట్టిన మహిళా విభాగంలో 400 మీటర్ల విభాగంలో నావల్‌ ఎల్‌ మౌత్‌వాకిల్‌ స్వర్ణ పతకం సాధించింది. నేవల్‌ గ్రీన్‌, ఎర్ర రంగు పొట్టి దుస్తులతోనే పరుగెత్తింది. అయితే ఆమె వేసుకున్న దుస్తుల వైపు ఎవరి దృష్టీ పోలేదు. ఇబ్బందులను అధిగమిస్తూ ఆమె ఎంత బాగా పరుగెడుతుందన్న అంశం పైనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఆమె ఇప్పుడు అధికారికంగా రియో డి జెనీరియోలో 2016లో జరిగే ఒలింపిక్స్‌లో కో-ఆర్డినేటింగ్‌ కమిటీకి నేతృత్వం వహించనుంది.
1991లో అల్గేరియన్‌ ముస్లిం మహిళ, మధ్యదూరపు పరుగుల రాణి హసిబా బౌల్మెర్కా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీటర్ల పందెం గెలిచింది.1992లో జరిగిన బార్సిలోనా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది. ఆ తరువాత ఖజక్‌ ముస్లిమ్‌ మహిళలు మైయా మనేజా, జుల్ఫియా ఛిన్షానియో కూడా వార్తల్లో నిలి చారు. ప్రేక్షకులకు వారి క్రీడా సామర్థ్యానికి జేజేలు పలికారు. బరువునెత్తే విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు. 2010లో సింగపూర్‌లోని యువ ఒలింపిక్‌ ఆటలలో మహ్మదీయ మహిళ మల్హాస్‌ అధికారికంగా సౌదీ నుండి ప్రవేశం పొందకపోయినా, సొంతంగా ప్రవేశించి, షో జంపింగ్‌లో కాంస్య పతకం సాధించింది.
మహిళలు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తులు వేసుకోవాలని ముస్లిమ్‌ కోడ్‌ ఆదేశిస్తోంది. ఈ కట్టుబాటును దృష్టిలో ఉంచుకుని మహమ్మదీయ మహిళల దుస్తులు చేతులు, కాళ్ళు కప్పి ఉంచే విధంగా ఉండవచ్చని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ అనుమతి నిచ్చింది.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొదటి అరబ్‌ దేశపు మహిళ 17 సంవత్సరాల ఖండేజా మొహ మ్మద్‌. ఫిఫాలో కూడా ప్రపంచ సాక్సర్‌ ఫెడరేషన్‌ కూడా మహమ్మదీయ మహిళలకు అనుకూలంగా మహిళల దుస్తుల నిబం ధనలో మార్పులు చేసింది. ముస్లిం మహిళలు వారి తలను కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించి ఆడవచ్చని నిర్ణయించింది.
నిజానికి ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు మహమ్మదీయ సంప్రదాయానికి అను గుణంగా అథ్లెట్‌ల దుస్తులు తయారు చేయడంలో తమ బుర్రలకు పని పెడుతు న్నారు. కేవలం ఒలింపిక్స్‌్‌లోనే కాక ముస్లిం మహిళలు సాకర్‌ వంటి ఆటలలో కూడా ప్రవేశం పొందారు. ఇక, భారతీయ మహిళా టెన్నిస్‌ రంగంలో సానియా మీర్జా ప్రాముఖ్యం సంతరించుకుంది.ముస్లిం పెద్దల నుండి కొంత అనంగీకారాన్ని ఎదుర్కొన్నా, ప్రియ మైన టెన్నిస్‌ ఆట ద్వారా ఆమె పేరు సంపాదించుకోవడాన్ని ఆపలేకపోయారు.
ఇస్లామిక్‌ ప్రపంచంలో సౌదీ అరే బియా రాజ్యాధికారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా కూడా తన కఠిన ఆంక్షలలో మార్పులు తేవడం విశేషం. ప్రైవేట్‌ పాఠశాలల్లో శారీరక విద్యలో, ఆట లలో పాల్గొనడానికి అవకాశమివ్వడంతో పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలు ముందుకు వస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఏమైనా, ప్రస్తుతానికి ఇది శుభా రంభమే. కేవలం గల్ఫ్‌లోనే కాక ఇతర ప్రాంతాలలో ఉన్న లక్షల మంది మహమ్మదీయ మహిళలకు పెద్ద స్థాయిలో అవకాశాలను అందించగలదు. ఇప్పటికే ఈ ఆలోచన బలం పుంజుకొని, ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌కి వాకిలి తీయబోతు న్నాయి. ప్రపంచ మహిళా అభిమానుల కోసం సౌదీ అరేబియా త్వరలో ఫుట్‌బాల్‌ స్టేడి యమ్‌లను ప్రారంభించనుంది. 2019లో జరగబోయే ఏసియన్‌ ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌కు ఆతిథ్యమివ్వనుంది.
ఇక, ఈ ఏడాది మే 17న పాతికేళ్ళ రహ ముహర్రక్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్నెక్కిన సౌదీ అరేబియాకు చెందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. సాధించిన విజయం గురించి ఆమె చెబుతూ, ''నేను మొదటి మహిళను అవ్వచ్చు కానీ, నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంకో మహిళ రెండవ స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నాను'' అన్నారు. ఎవరెస్ట్‌ ఎక్కడం కన్నా, అందుకు కుటుంబాన్ని ఒప్పించడమే ఆమెకు ఎక్కువ కష్ట మైంది. ఇప్పుడు వాళ్ళు పూర్తి సహకారాన్ని అంది స్తున్నారు. సౌదీ అరేబి యాకు చెందక పోయినా, మరో ముస్లిం మహిళ రెండో స్థానంలో చేరింది. పాకి స్థాన్‌లోని ఓ కుగ్రామా నికి చెందిన 21 ఏళ్ళ సమీనా బేగ్‌ ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిం చడం ద్వారా పాక్‌తో సహా పలు దేశాల వారిని ఆశ్చ ర్యానికి గురి చేసింది. మొత్తం మీద, తమపై ఉన్న ఛాందస వాద ఆంక్షలను క్రీడా రంగంలోనూ మహిళా లోకం క్రమంగా అధిగమిస్తూ ముందుకు సాగడం సంతోషించాల్సిన పరిణామం.

No comments:

Post a Comment