Wednesday, September 11, 2013

నేను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు

నేను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు' అని దక్షిణాది నటి సింధూమీనన్ పేర్కొంది. ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ
మీడియాలో వస్తున్న వార్తలను ఈమె ఖండించింది. అప్పుల బాధ భరించలేక సింధూ మీనన్ ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. అపస్మారకస్థితిలో ఉన్న ఈమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారని మీడియాలో మంగళవారం  వార్తలు గుప్పుమన్నాయి. తాను ఆత్మహత్యకు ప్రయత్నించలేదని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని సింధూమీనన్ పేర్కొంది. సింధూమీనన్ తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం తదితర చిత్రాల్లో నటించింది.

No comments:

Post a Comment