సాధారణంగా అందంగా కనిపించే మోములో విరిసే చిరునవ్వు, హరివిల్లులా వంగే అధర సౌందర్యం ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అంత కాదు మిమ్మల్ని అందంగా మార్చుతుంది. ముఖ్యంగా పింక్ లిప్స్ మీ చిరువునవ్వును మరింత ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. కానీ, ప్రస్తుత కాలంలో చాలా మంది వారి అటువంటి అందమైన సున్నితమైన పెదాల అందాన్ని పింక్ లిప్స్ ను కోల్పోయారు. వారి పెదవులు నల్లగా మరియు పగులిన పెదాల్లా మారుతున్నాయి. ఇలాంటి పెదవుల కలవారు, ఎంత అందంగా ఉన్నా సరే పెదాలు నల్లగా ఉంటే ఆ అందం అంతా వ్యర్థంగా అనిపిస్తుంది. మీ ముఖం వికారంగా కనిపించేలా చేస్తుంది. అటువంటి పెదాల(సమస్య)ను కాస్మోటిక్స్ తో దాచడం అంత సులభం కాదు, కాస్మొటిక్స్ ఉపయోగం వల్ల అవి మరింత నులుపుగా మారడానికి దారితీయవచ్చు. అందుకు, మీరు ధూమపానం మరియు కెఫిన్ వంటివి వదిలిపెట్టడం ద్వారా మీ పెదవుల నష్టాన్ని చక్కదిద్దుకోవచ్చు. పెదాలకు యూవీ కిరణాల ప్రభావం తగల కుండా లిప్ బామ్స్ ను ఉపయోగించాలి.. ఇంకా వీటితో పాటు, సహజ పదార్థాలతో స్ర్కబ్బింగ్ చేయడం వల్ల పెదాల మీద పెళుసుగా ఊడివచ్చే డెడ్ స్కిన్ తొలగించవచ్చు. ఇంకా మీ పెదాలు ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవడంతో పాటు, మాయిశ్చరైజ్ ను నిర్ధారించుకోండి. పెదాల ఆరోగ్యానికి ఒక ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. దాంతో పాటు ప్రతి రోజూ 8గ్లాసుల నీరు తప్పని సరిగా తీసుకోవాలి. ఇంకా మీ పెదాలను నాలుకతో తడపడం లేదా కొరకడ వంటివి చేయకుండా ఉండాలి. ఈ డార్క్ లిప్స్ అనేది ఒక అసాధారమైన సమస్య కాదు. నల్లగా, అసహ్యంగా మారిన పెదాలను తిరిగా మునపటి స్థితికి తీసుకు రావడానికి, పెదాలు పింక్ కలర్ లో ఆకర్షించడానికి వివిధ రకాల మార్గాలున్నాయి. కానీ, వాటిని పాటించడానికంటే ముందు పెదాలు నల్లగా మారడానికి మనం తెలుసుకోవల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ పెదాలను నల్లగా మార్చేటటువంటి విషయాలకు క్రింది విధంగా పరిశీలించండి...
స్మోకింగ్ : స్మోకింగ్ వల్ల పెదాలు నల్లగా మారుతాయే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. సిగరెట్స్ లో ఉన్ననికోటిన్ పెదాలను నల్లగా మార్చుతుంది మరియు పెదాలు సహజ రంగును కోల్పోయి అసహ్యంగా కనబడుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా హరించేసే ఈ ధూమపానాన్ని వెంటనే నిలిపివేయడం ఉత్తమ పద్దతి.

No comments:
Post a Comment