Thursday, August 16, 2012

కవ్వించే పెదాలకు కనిపించి, కనిపించని లేత రంగులు

How Pick The Right Shade Lipstick
సాధారణంగా మహిళల అలంకరణ వస్తువుల్లో తప్పనిసరిగా ఉండేటివి లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్. తమ అందం కోసం ఎంతగా మేకప్ చేసుకొన్నా చివరికి పూర్తి అయ్యేది లిప్ స్టిక్ తోనే. వీటిలో కొందరు ముదురు రంగులు ఇష్టపడితే
మరికొందరు కనిపించి కనిపించకుండా కవ్వించే రంగులను లేత రంగులు ఇష్టపడుతారు. మేకప్ సరిగ్గా వచ్చిందీ లేనిదీ పెదవులకు వేసుకునే లిప్‌ స్టిక్ షేడ్‌ను బట్టి ఇట్టే చెప్పేయవచ్చు. అయితే స్కిన్‌ టోన్‌ కి తగ్గట్టుగా ఏ షేడ్ తీసుకుంటే బాగుంటుందో లిప్‌ స్టిక్ కొనుగోలు చేసేముందు అనేక సందేహాలు వస్తుంటాయి. సరైన లిప్‌ స్టిక్‌ను ఎంచుకోవడానికి మేలైన ట్రిక్స్...
కొనుగోలు చేసేముందు... అరచేయి వెనక భాగంలో లిప్‌ స్టిక్ షేడ్‌ ని కొద్దిగా రాయాలి. రంగు మరింతగా తెలుసుకోవడానికి వేలితో రబ్ చేసి, దానిని పెదవులకు రాసుకొని చెక్ చేసుకోవాలి. లిప్‌ స్టిక్ షేడ్‌ ని సూర్యకాంతిలో చూస్తే అసలైన రంగు తెలుస్తుంది.
ఫెయిర్ స్కిన్... ఈ చర్మం రంగు గల వారు లైటర్ షేడ్ లిపి స్టిక్‌ ను ఎంచుకోవాలి. చర్మం ఫెయిర్‌ గా ఉండి, జుట్టు నల్లగా ఉన్నవారు డీప్ పింక్, క్యారమెల్ కాంబినేషన్స్‌తో ఉన్నది ఎంచుకోవాలి. సాధారణరంగు చర్మం, జుట్టు ఉన్నవారికి ఏ షేడ్ అయినా నప్పుతుంది.
నలుపు, చామనచాయ... ప్లమ్ లేదా వైన్ కలర్ లిప్‌ స్టిక్ చామనచాయ వారికి బాగా నప్పుతుంది. ఆలివ్ స్కిన్ గల వారికి ఎరుపు, లైట్ బ్రౌన్ రంగులు సూటవుతాయి. వీరు బ్రైట్ రెడ్, పింక్ కలర్స్‌లో డల్ షేడ్స్ ఎంచుకోవడం మంచిది. బ్లాక్‌బెర్రీ, క్యారమెల్, పర్పుల్ షేడ్స్ డస్కీ స్కిన్ టోన్ గల వారికి నప్పుతాయి.
లేత రంగులు వేసుకునేప్పుడు ముందుగా లిప్‌ బామ్‌ను ముందుగా అప్లై చేసుకోవాలి. పెదవులపై వుండే గీతలు వంటివి దీని వల్ల కాస్త కనిపించకుండా వుంటాయి.లిప్‌ లైనర్‌ని వేసుకోకుండా లిప్‌స్టిక్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయాలి. ఇది పెదవులపై గీతలను కనిపిం చకుండా అందంగా చేస్తాయి.ముదురు గులాబీ రంగులు ఇష్టపడేవారు క్రీమీగా వుండే వాటిని ఎంచుకుంటే బాగుంటుంది. దీనికి బ్రష్‌ వుపయోగించడం మేలు.
లిప్‌ లైన్‌ని వేసుకుని తరువాత వేసుకుంటే చక్కటి ఆకర్షణ వస్తుంది. మరీ ముదురుగా వుండే షేడ్స్‌ ముఖాన్ని అలసిపో యినట్లు కనిపించేలా చేస్తాయి. ఇవి బ్రైట్‌ కలర్‌ వున్న వారికైతేనే నప్పుతాయి. సాధారణ రంగు వున్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఏ మేకప్‌ వేసుకున్నా ఆ సామాగ్రిని ఆరు నెలలకు మించి ఉపయోగించకపోవడం ఉత్తమం.

No comments:

Post a Comment