
పాలకూర: 2cups
మటన్: 1/2kg
పచ్చిమిర్చి తరుగు: 4-6.......................
ఉల్లిపాయ తరుగు: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పసుపు: 1/2tsp
కారం: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
సాజీర: 1tsp
టమోట: 1
యాలకుల, వంగాలు, మిరియాలు: 1tsp
గరం మసాలా: 2tsp
ధనియాల పొడి: 1tsp
కొబ్బరిపొడి: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tsp
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ విడిగా ఉడికించి పక్కన పెట్టాలి.
2. తర్వాత మరిగించిన నీళ్లలో పాలకూర వేసి, తర్వాత నీరు వంపేసి గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడ పాన్ లో నూనె వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లవంగాలు, బిర్యాని ఆకు, యాలకులు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి.
4. తర్వాత పాలక్ పేస్ట్ వేసి నూనె తేలేవరకు ఉడికించాలి. కొద్దిసేపటి తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, టమోట ముక్కలు, ఉప్పు, ఉడికిన మటన్ వేసి మూత పెట్టాలి.
5. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలిపి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. అంతే పాలక్ మటన్ కర్రీ రెడీ. ఇది వేడి వేడి అన్నం, చపాతి, నాన్ కు మంచి కాంబినేషన్.
No comments:
Post a Comment