ప్రముఖ నాటక దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు సత్యదేవ్ దుబే(75) ఆదివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిరోజులుగా కోమాలో ఉన్నారు..................ఈ ఉదయం 11.30 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మరాఠీ-హిందీ నాటక రంగంలో ఎనలేని కీర్తిని ఆర్జించిన సత్యదేవ్ మధ్యప్రదేశ్‌లోని(ఇప్పటి ఛత్తీస్‌గడ్) బిలాస్‌పూర్‌లో 1936లో జన్మించారు.
క్రికెటర్ కావాలనే కోరికతో ముంబైకి వచ్చిన ఆయన నాటక సమాజంలో చేరారు. పలు నాటకాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగానూ రాణించారు. సినిమా నటుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా పనిచేశారు. ఆయనకు ప్రతిభకు పలు అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. |
No comments:
Post a Comment