బోన్‌లెస్ చికెన్ - పావు కేజీ
పుదీనా - 1 కట్ట.......................
కొత్తిమీర - 1 కట్ట
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 6 రెబ్బలు
నిమ్మకాయ - 1
ధనియాల పొడి - 1 స్పూను
గరం మసాలా - 1 స్పూను
పెరుగు - 2 స్పూన్లు
శనగపిండి - అర కప్పు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
పుదీన, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, ముందుగా నూరిపెట్టుకున్న పుదీన, పచ్చిమిర్చి ముద్ద బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి. తర్వాత అందులో ఒక స్పూను వేడి నూనె, శనగపిండి కలపాలి. కాగిన నూనెలో శనగపిండి కలిపిన చికెన్‌ను పకోడీలా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీస్తే చాలు. రుచికరమైన వేడి వేడి చికెన్ పకోడీ రెడీ.
No comments:
Post a Comment