నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం 'శ్రీరామరాజ్యం' ఈనెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీరాముడిగా నటిస్తుండగా సీతగా నయనతార నటిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు....శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మించారు. లక్ష్మణుడుగా శ్రీకాంత్, వాల్మీకిగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన సెన్సార్‌కు వెళ్ళనుంది.
ఈ సందర్భంగా నిర్మాత సాయిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ నటవారసునిగా పౌరాణికాల్లోనూ రాణించాలన్న బాలయ్య కోరిక ఈ సినిమాతో నెరవేరింది. చరిత్రలో నిలిచిపోయే అద్భుత దృశ్యకావ్యంలా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు.
సంగీత మేధావి ఇళయరాజా అందించిన అద్భుత సంగీత బాణీలు ప్రేక్షకులను మదిలో సుస్థిరంగా నిలిచిపోతాయన్నారు. ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు సైతం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

No comments:
Post a Comment