కావలసిన పదార్థాలు
కోఫ్తాకి : మెత్తటి మాసం (కైమా) - పావుకేజీ, ఉల్లిపాయలు - పావుకేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్లు, కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - చిన్న కట్ట, గరంమసాలా పొడి - 1 స్పూన్
నిమ్మకాయ - సగం ముక్క, కారం - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, వేయించిన శనగపప్పు - 75 గ్రా
గ్రేవీకి కావలసినవి
ఉల్లిపాయలు - 3, అల్లం వెల్లుల్లి పేస్టు- 2 స్పూన్లు, కారం - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు, నూనె - 4 స్పూన్లు, గరం మాసాలా - 1 స్పూన్
గసగసాలు - 2 స్పూన్లు, సారపప్పు - 1 స్పూన్, కొత్తిమీర - 1 కట్ట
పెరుగు - 1 కప్పు, మామిడి పండ్ల రసం - 100 గ్రా, ఉప్పు - తగినంత
కోఫ్తా తయారీ
సగం కైమాలో అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమానికి అరకప్పు నీళ్లు పోసి నీరంతా ఇంకిపోయే వరకు మెత్తగా ఉడికించాలి. వేయించిన శనగపప్పును మెత్తగా పొడిచేసుకోవాలి. ఉడికించిన కైమాను, మిగిలిన కైమతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దానికి గరంమసాలా పొడి, శనగపప్పు పొడి, నిమ్మరసం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టాలి.
గ్రేవీ తయారీ : బాణలిలో తగినంత నూనెపోసి కాగనివ్వాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని నిలువుగా చీల్చిన పచ్చిమిర్చిని దోరగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, సారపప్పు, గసగసాల ముద్ద, కారం, ఉప్పు, కొత్తిమీర కలిపి నూనె చిందేవరకు వేయించాలి. ఇందులో ముందుగా చేసిపెట్టకున్న కోఫ్తా ఉండలు వేసి కొంచెం సేపు ఉండికించాలి. ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా, మామిడిపండ్ల రసం చేర్చి సన్నటి మంటపై మరికొంతసేపు ఉంచాలి. స్టౌమీది నుండి దించాక కొత్తిమీర, మీగడ వేసి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

No comments:
Post a Comment