Saturday, April 9, 2011

మా నాన్న వారసుడు జూనియర్ ఎన్టీఆరే: పురంధేశ్వరి

తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడు ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆరేనని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. తన తండ్రి ఎలా సంచలనాలు సృష్టించారో అదేవిధంగా సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు సృష్టిస్తున్నాడని పొగడ్తల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని అన్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ కటుంబ సభ్యులను అవసరానికి వాడుకుని ఆ తర్వాత కరివేపాకులా తీసి పారేయడమే బాధ కలిగిస్తోందన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చేటట్లయితే జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచనలు చేశారు. సినిమాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మాత్రం ఆచితూచి అడుగులేయాలన్నారు.

No comments:

Post a Comment