Wednesday, March 2, 2011

బీరకాయ - మెంతి పులుసు

కావలసిన పదార్థాలు
లేతబీరకాయలు - అరకేజి
ఎండు మిర్చి - 8
పచ్చి శనగపప్పు - 2 టీ స్పూన్లు
మినప్పప్పు - 2 టీ స్పూన్లు
జీలకర్ర - 1 టీ స్పూన్‌
నూనె - 1 టీ స్పూన్‌
మెంతులు - అర స్పూన్

చింతపండు - కొంచెం
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
తయారు చేసే పద్ధతి
ఎండు మిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్రను కొంచెం నూనెలో వేయించి పొడి చెయ్యాలి. మెంతులను విడిగా వేయించి పొడి చెయ్యాలి. బీరకాయలు ముక్కలుగా కొయ్యాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పుతో పోపుచేసి అందులో బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మెంతిపొడి, చిక్కటి చింతపులుసు వేసి కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

No comments:

Post a Comment