Wednesday, February 9, 2011

గాయని ఉష అందించిన సుస్వరాల మాలిక


usha 

గాయని ఉష అందించిన సుస్వరాల మాలిక ‘సాయి ఉషస్సు’ మార్కెట్లోకి విడుదలైంది. గాయకుడు మల్లికార్జున్‌ సంగీతం అందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆల్బమ్‌ ఆవిష్కరణ వేడుకలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉష, మల్లికార్జున్‌, రాధాకృష్ణ, సత్యదేవ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్‌, వేణు, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ బాలు తొలిసిడిని ఆవిష్కరించి తమ్మారెడ్డి భరద్వాజకి అందించారు. మల్లికార్జున్‌ మాట్లాడుతూ ‘సాయి స్వరార్చన- తర్వాత ఉష ప్రోద్భలంతో రూపొందిన ఆల్బం ఇది. బాలు సమక్షంలో మార్కెట్లోకి విడుదలవ్వడం ఆనందంగా ఉంది’ అన్నారు. ఉష మాట్లాడుతూ ‘పెద్దలు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు లభించినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.

No comments:

Post a Comment